ఘోరమైన ఏడు పాపములు ఏవి?

ప్రశ్న ఘోరమైన ఏడు పాపములు ఏవి? జవాబు ఈ ఘోరమైన ఏడు పాపముల జాబితా ప్రధానంగా ఆదిమ క్రైస్తవ బోధలలో అనుచరులకు పతనావస్థలో ఉన్న మానవుడు పాపమును చేయుటకు కలిగియున్న ఆలోచనను గూర్చి ఉపదేశించి బోధించుటకు ఉపయోగించబడేది. ఈ ఏడు “ఘోరమైన” పాపముల యొక్క జాబితాను గూర్చి ఉన్న ఒక భావము ఏమంటే దేవుడు వాటిని క్షమించనే క్షమించడు అనే వాదన. దేవుడు క్షమించని పాపము శాశ్వతమైన అవిశ్వాసము అని పరిశుద్ధగ్రంథము చెప్తుంది, ఎందుకంటే క్షమింపబడుటకు ఉన్న…

ప్రశ్న

ఘోరమైన ఏడు పాపములు ఏవి?

జవాబు

ఈ ఘోరమైన ఏడు పాపముల జాబితా ప్రధానంగా ఆదిమ క్రైస్తవ బోధలలో అనుచరులకు పతనావస్థలో ఉన్న మానవుడు పాపమును చేయుటకు కలిగియున్న ఆలోచనను గూర్చి ఉపదేశించి బోధించుటకు ఉపయోగించబడేది. ఈ ఏడు “ఘోరమైన” పాపముల యొక్క జాబితాను గూర్చి ఉన్న ఒక భావము ఏమంటే దేవుడు వాటిని క్షమించనే క్షమించడు అనే వాదన. దేవుడు క్షమించని పాపము శాశ్వతమైన అవిశ్వాసము అని పరిశుద్ధగ్రంథము చెప్తుంది, ఎందుకంటే క్షమింపబడుటకు ఉన్న ఏకైక మార్గాన్ని ఇది విస్మరిస్తుంది గనుక – యేసుక్రీస్తు మరియు సిలువపై ఆయన అనుభవించిన ప్రత్యామ్నాయ మరణమును విస్మరిస్తుంది ఇది.

అయితే ఈ ఏడు ఘోరమైన పాపములు అనే ఆలోచన లేఖనానుసారమైనదేనా? అవును మరియు కాదు. సామెతలు 6:16-19 ప్రకారం, “యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు: 1) అహంకార దృష్టి, 2) కల్లలాడు నాలుక, 3) నిరపరాధులను చంపు చేతులు, 4) దుర్యోచనలు యోచించు హృదయము, 5) కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, 6) లేనివాటిని పలుకు అబద్దసాక్షి, మరియు 7) అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడు.” కాని, అత్యంత ఘోరమైన ఏడు పాపములుగా చాలా మంది పరిగణించేవి మాత్రం ఇవి కాదు.

ఆరవ శతాబ్దమునకు చెందిన పొప్ గ్రెగరీ ది గ్రేట్ ప్రకారం, ఘోరమైన ఏడు పాపములు ఏవనగా: అహంకారము, అసూయ, తిండిబోతుతనము, మోహము, కోపము, అత్యాశ, మరియు బద్ధకము. ఇవన్నియు పాపములు అనుటలో సందేహము లేనప్పటికీ, ఇవి పరిశుద్ధగ్రంథములో “ఘోరమైన ఏడు పాపములు”గా మాత్రం చెప్పబడలేదు. ఘోరమైన ఏడు పాపములుగా సంప్రదాయబద్ధంగా పరిగణించబడే జాబితా మనుగడలో అనేక పాపములను విభజించి చూపుటకు ఒక మంచి విధానముగా దోహదపడుతుంది. అతి ప్రాముఖ్యంగా, ఈ ఏడు పాపములు అనేవి ఇతర పాపములతో పోల్చితే ఎంతమాత్రము “ఘోరమైనవి” అయితే కావు. పాపములు అనేవి అన్నియు మరణమునకు దారి తీస్తాయి (రోమీయులకు 6:23). యేసుక్రీస్తు ద్వారా మన పాపములన్నియు, అనగా “ఘోరమైన ఏడు పాపములు”గా పరిగణించబడే వాటితో కలిపి, క్షమింపబడగలవు మరియు ఇందును బట్టి దేవునికి స్తోత్రము (మత్తయి 26:28; అపొస్తలుల కార్యములు 10:43; ఎఫెసీయులకు 1:7).

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

ఘోరమైన ఏడు పాపములు ఏవి?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *