దేవుని దృష్టిలో పాపములు అన్నియు ఒక్కటేనా?

ప్రశ్న దేవుని దృష్టిలో పాపములు అన్నియు ఒక్కటేనా? జవాబు మత్తయి 5:21-28లో, యేసు ఒకని హృదయములో ఉన్న మోహమును వ్యభిచారించుటతోనూ మరియు ఒకని హృదయములో అసూయను నరహత్యతోనూ సమానంగా చెప్తున్నాడు. కాని, దీని అర్ధము పాపములు అన్నియు సమానమే అని కాదు. యేసు పరిసయ్యులకు ఏమి చెప్పాలని ఆశించాడు అంటే ఒక పాపము అనునది కేవలము క్రియారూపకముగా చేసినప్పుడు మాత్రమే కాక ఆ విధంగా చేయాలని ఆలోచన కలిగినప్పుడే పాపముగా పరిగనించబడుతుంది అని. యేసు దినములలో మత…

ప్రశ్న

దేవుని దృష్టిలో పాపములు అన్నియు ఒక్కటేనా?

జవాబు

మత్తయి 5:21-28లో, యేసు ఒకని హృదయములో ఉన్న మోహమును వ్యభిచారించుటతోనూ మరియు ఒకని హృదయములో అసూయను నరహత్యతోనూ సమానంగా చెప్తున్నాడు. కాని, దీని అర్ధము పాపములు అన్నియు సమానమే అని కాదు. యేసు పరిసయ్యులకు ఏమి చెప్పాలని ఆశించాడు అంటే ఒక పాపము అనునది కేవలము క్రియారూపకముగా చేసినప్పుడు మాత్రమే కాక ఆ విధంగా చేయాలని ఆలోచన కలిగినప్పుడే పాపముగా పరిగనించబడుతుంది అని. యేసు దినములలో మత నాయకులు అనుకునేవారు నీవు చేయనాశించిన దేనినైనా గురించి ఆలోచించడం, అట్టి క్రియను నీవు కార్యరూపము దాల్చనంతవరకు, సరియైనదే అని. దేవుడు ఒక వ్యక్తి యొక్క ఆలోచనలను అలాగే తన క్రియలను కూడా తీర్పుతీరుస్తాడు అని గ్రహించునట్లు యేసు వారిని చేస్తున్నాడు. మన హృదయములలో ఉన్న ఆలోచనల ప్రతిఫలమే మనము చేసే కార్యములు అనే విషయాన్ని యేసు వారితో సద్బోధించాడు (మత్తయి 12:34).

కాబట్టి, మోహపు చూపు మరియు వ్యభిచారము ఇవి రెండు కూడా పాపములే అని యేసు చెప్పినప్పటికీ, ఇవి రెండు సమానమైనవే అనుటకు లేదు. ఒక వ్యక్తిని అసహ్యించుకోవడం అనేది ఆ వ్యక్తిని హత్యచేయడం అంత తీవ్రమైనది కాదు, కాని ఇవి రెండు కూడా దేవుని దృష్టిలో పాపములే. పాపములో కొన్ని దశలు ఉన్నాయి. కొన్ని పాపములు ఇతర పాపములకంటే చాలా తీవ్రమైనవి. అదే సమయంలో, నిత్యమైన పర్యావసానములు మరియు రక్షణ నేపథ్యంలో పాపములు అన్నియు సమానమైనవే. ప్రతియొక్క పాపము నిత్య శిక్షకు నడిపిస్తుంది (రోమీయులకు 6:23). పాపములన్నియు, అది ఎంతటి “చిన్నది” అయినప్పటికీ, అపరిమితమైన నిత్యమైన దేవునికి వ్యతిరేకమినదే, మరియు అపరిమిత నిత్య శిక్షకు అది యోగ్యమైనదిగా కనబడుతుంది. ఇంకా, దేవుడు క్షమించలేనంత “ఘోరమైన” పాపము అనేది ఏదీ లేదు. పాపమునకు ప్రాయశ్చిత్తము చెల్లించుటకు యేసు మరణించాడు (1 యోహాను 2:2). యేసు మనందరి పాపముల కొరకు మరణించాడు (2 కొరింథీయులకు 5:21). దేవుని దృష్టిలో పాపములన్నియు సమానమైనవేనా? అవును మరియు కాదు. తీవ్రతలో? కాదు. శిక్షావిధిలో? అవును. క్షమింపబడుటలో? అవును.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

దేవుని దృష్టిలో పాపములు అన్నియు ఒక్కటేనా?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *