నేను పరిశుద్ధాత్మతో ఎలా నింపబడగలను?

ప్రశ్న నేను పరిశుద్ధాత్మతో ఎలా నింపబడగలను? జవాబు పరిశుద్ధాత్మతో నింపబడుటను అర్థం చేసుకొనుటకు ముఖ్యమైన వచనము యోహాను 14:16, మరియు అక్కడ ఆత్మ విశ్వాసులలో నివసిస్తుందని మరియు ఆత్మ నింపుదల శాశ్వతంగా ఉంటుందని యేసు వాగ్దానం చేశాడు. ఆత్మ నింపుదల మరియు ఆత్మ మనలో నివసించుట మధ్య బేధమును గమనించుట అవసరము. ఆత్మ శాశ్వతంగా నివసించుట కొంతమంది విశ్వాసుల కొరకు మాత్రమే కాదు, అది విశ్వాసులందరి కొరకు. ఈ విషయమును సమర్థించు లేఖన భాగములు చాలా ఉన్నాయి….

ప్రశ్న

నేను పరిశుద్ధాత్మతో ఎలా నింపబడగలను?

జవాబు

పరిశుద్ధాత్మతో నింపబడుటను అర్థం చేసుకొనుటకు ముఖ్యమైన వచనము యోహాను 14:16, మరియు అక్కడ ఆత్మ విశ్వాసులలో నివసిస్తుందని మరియు ఆత్మ నింపుదల శాశ్వతంగా ఉంటుందని యేసు వాగ్దానం చేశాడు. ఆత్మ నింపుదల మరియు ఆత్మ మనలో నివసించుట మధ్య బేధమును గమనించుట అవసరము. ఆత్మ శాశ్వతంగా నివసించుట కొంతమంది విశ్వాసుల కొరకు మాత్రమే కాదు, అది విశ్వాసులందరి కొరకు. ఈ విషయమును సమర్థించు లేఖన భాగములు చాలా ఉన్నాయి. మొదటిగా, ఎలాంటి బేధము లేకుండా యేసులో విశ్వాసులందరికి ఇవ్వబడిన బహుమానము పరిశుద్ధాత్మ, మరియు క్రీస్తునందు విశ్వాసము తప్ప మరి ఏ షరతు దీని కొరకు విధించబడలేదు (యోహాను 7:37-39). రెండవది, పరిశుద్ధాత్మ రక్షణ పొందిన క్షణమున ఇవ్వబడుతుంది (ఎఫెసీ. 1:13). ఆత్మ ముద్రణ మరియు నింపుదల విశ్వసించిన సమయంలో కలిగిందని గలతీ 3:2 వక్కాణిస్తుంది. మూడవదిగా, పరిశుద్ధాత్మ విశ్వాసులలో శాశ్వతంగా నివసిస్తుంది. పరిశుద్ధాత్మ విశ్వాసులకు క్రీస్తులో రానున్న మహిమకు నిర్థారణగా ఇవ్వబడింది (2 కొరింథీ. 1:22; ఎఫెసీ. 4:30).

ఎఫెసీ. 5:18లో చెప్పబడిన ఆత్మ నింపుదలకు ఇది భిన్నంగా ఉంది. మనం పరిశుద్ధాత్మకు ఎంతగా లోబడియుండాలంటే, ఆయన మనలో పరిపూర్ణంగా ఉండాలి మరియు మనలను నింపాలి. ఆయన ప్రతి విశ్వాసిలో ఉంటాడని రోమా. 8:9 మరియు ఎఫెసీ. 1:13-14, మరియు ఆయన దుఖపడే అవకాశం ఉంది (ఎఫెసీ. 4:30), మరియు మనలో ఆయన కార్యము ఆర్పగలిగినది (1 థెస్స. 5:19). ఇలా జరుగుటకు మనం అవకాశం ఇచ్చినప్పుడు, మనలో మరియు మన ద్వారా ఆయన శక్తిని మరియు పూర్ణ ఆత్మ కార్యములను అనుభవించలేము. ఆత్మతో నింపబడుట అనగా మన జీవితాలలో పర్తి భాగమును ఆయన ఆక్రమించి, మనలను నడిపించి శాసించే అవకాశం ఆయనకు ఇచ్చుట. మరియు మన ద్వారా ఆయన శక్తిని మనం ఉపయోగించవచ్చు మరియు మనం చేయునది దేవునికి ఫలభరితముగా ఉంటుంది. ఆత్మ నింపుదల కేవలం బాహ్య కార్యములకు మాత్రమే వర్తించదు; అది మన క్రియల యొక్క అంతరంగ ఆలోచనలకు మరియు ఉద్దేశములకు వర్తిస్తుంది. “యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమునునీ దృష్టికి అంగీకారములగును గాక” అని కీర్తనలు 19:14 చెబుతుంది.

ఆత్మ నింపుదలకు మరియు ఆత్మ నింపుదలను కొనసాగించుటలో దేవునికి విధేయులగుటకు పాపం ఆటంకం కలిగిస్తుంది. మనం ఆత్మతో నింపబడాలని ఎఫెసీ. 5:18 ఆజ్ఞాపిస్తుంది. అయితే, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయుట నింపుదలను సాధించదు. కేవలం దేవుని ఆజ్ఞలకు విధేయులైయుండటమే మనలో ఆత్మ కార్యములకు స్వతంత్రత ఇస్తుంది. ఇప్పటికీ పాపము మనపై ప్రభావం చూపగలదు కాబట్టి, ఆత్మతో అన్నివేళలా నింపబడియుండుట అసంభవము. మనం పాపం చేసినప్పుడు, ఆత్మతో నింపబడియుండుటకు మరియు ఆత్మ ద్వారా నడిపింపబడుటకు మనం దానిని వెంటనే దేవుని ఎదుట ఒప్పుకోవాలి.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

నేను పరిశుద్ధాత్మతో ఎలా నింపబడగలను?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *